• Neti Charithra

సంక్షేమం ప్రతి కుటుంబానికి చేరాలి- అధికారుల సమీక్షలో సీఎం జగన్

#సంక్షేమం ప్రతి కుటుంబానికి చేరాలి- అధికారుల సమీక్షలో సీఎం జగన్

కడప: నేటి చరిత్ర( సెప్టెంబర్2) కడప పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల అభివృద్ధిపై ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటి (పాడ)పై అధికారులతోను ఈసందర్భంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా యూసీఐఎల్‌ కాలుష్యంపై అధికారుల వద్ద ఆరా తీశారు. ఈ సందర్భంగా యూసీఐఎల్‌ సీఎండీ హస్నావి సీఎంని కలిసి.. వివరించారు. ఇప్పటికే యూసీఐఎల్‌ కాలుష్యంపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో నిపుణుల కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా సమావేశంలో సీఎం వివరాలు సేకరించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon