• Neti Charithra

స్కూల్ బస్సులో మంటలు.. 40 మంది విద్యార్థులకు తప్పిన ముప్పు!

#స్కూల్ బస్సులో మంటలు.. 40 మంది విద్యార్థులకు తప్పిన ముప్పు!

రాజోలు : నేటి చరిత్ర (సెప్టెంబర్25) తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం శ్రీ సాయి దీప్తి స్కూలు బస్సుకు ముప్పు తప్పింది. బుధవారం సాయంత్రం స్కూల్‌ నుండి విద్యార్థులను నగరం నుండి మామిడికుదురు తీసుకెళ్తుండగా స్కూలు బస్సులో బ్యాటరీలో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో బస్ లో వైరింగ్ కాలిపోయింది. దీంతో డ్రైవర్ రాజేష్ బస్సును నిలిపివేయగా.. మామిడికుదురు నుండి నగరం వైపు వెళ్తున్న నగరం ఎస్ఐ సతీష్ హుటాహుటిన విద్యార్ధులను బస్సు నుండి దించివేశారు. దీంతో విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో సాంకేతిక‌ లోపం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపించారు. బస్సులో ఉన్న విద్యార్థులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ స్కూల్ బస్ లో 40 మంది విద్యార్ధులు ఉన్నారు. ఈ ఘటనలో సమయస్ఫూర్తితో వ్యవహరించి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వేరే బస్సులో విద్యార్ధులను పంపించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon