• Neti Charithra

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన .. పవన్ కళ్యాణ్!

#సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన .. పవన్ కళ్యాణ్!

మంగళగిరి: నేటి చరిత్ర (అక్టోబర్23) ఓటమికి భయపడే వాణ్ణి కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే బెంబేలు పడే వ్యక్తిని కాదని.. గెలిచినా, ఓడినా చివరి వరకు పార్టీని నడుపుతానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులో ప్రకాశం జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపే ముఖ్యం అనుకుంటే వంద వ్యూహాలు పన్నేవాడినని అన్నారు. కేసులు ఉన్నవారు పైవారి దగ్గర బలంగా మాట్లాడలేరని, కేసులు ఉన్నవారు సీఎం అయితే..ఎంత వరకు న్యాయం జరుగుతుందని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. జాతీయ స్ఫూర్తి కలిగిన నాయకులు కావాలన్నారు. తనకు జగన్‌, చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవని.. వారు తనకు నష్టం చేసినా పట్టించుకోనని పవన్‌ అన్నారు. డబ్బు, మద్యం పంచని ఎన్నికలు రావాలని పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇసుక కొరత వల్ల నిర్మాణ రంగం కుదేలైందని, వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. నవంబర్ 3వ తేదీన విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం భారీ ర్యాలీ నిర్వహిస్తానని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon