• Neti Charithra

సీఎం జగన్ తో.. సినీ పెద్దల చర్చలు.. సఫలం.. సినీ షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ !


సీఎం జగన్ తో.. సినీ పెద్దల చర్చలు.. సఫలం.. సినీ షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ !


అమరావతి: నేటి చరిత్ర


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో చిత్ర పరిశ్రమ పెద్దలు నిర్వహించిన భేటి

సానుకూల వాతావరణం లో ముగిసింది. సమావేశం అనంతరం మీడియా తో చిరంజీవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం ఎంతో

సంతోషంగా ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. జులై 15వ తేదీ తర్వాత ఏపీలో షూటింగ్‌లు చేసుకునేందుకు సీఎం అంగీకరించారని చిరు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మంగళవారం సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు.  అగ్ర నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌బాబు,

సి.కల్యాణ్‌, దిల్‌రాజు తదిరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై ఈ సందర్భంగా సీఎం జగన్‌తో వారు చర్చించారు. 

198 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon