• Neti Charithra

సర్కిల్ ఇన్స్ పెక్టర్ వేధిస్తున్నాడని.. స్టేషన్ ఎదుట..పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నం..!


సర్కిల్ ఇన్స్ పెక్టర్ వేధిస్తున్నాడని.. స్టేషన్ ఎదుట..పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


సివిల్ పంచాయతీ లో ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్

వేధిస్తున్నాడని ఆక్రోశిస్తూ.. ఆవేదనకు గురై ఓ రైతు పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పడి న ఘటన కర్నూలు జిల్లాలో కల కలం రేపింది.

వివరాల్లోకి వెళితే..కర్నూలు జిల్లా

పెద్దకడబూరు, మండల కేంద్రానికి చెందిన ఉప్పర ఈరన్న అనే రైతు శుక్రవారం పోలీసు స్టేషన్‌ ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అన్నదమ్ముల భూ వివాదంలో పోలీసులు జోక్యం తగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్నాడు. పోలీసులు పెట్రోలు సీసాను లాక్కుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. బాధితుడు మాట్లాడుతూ.. తన తండ్రి ఆస్తి 1.20 ఎకరాల భూమిని పెదనాన్న, చిన్నాన్న

లాక్కుని అన్యాయం చేశారని వాపోయారు. తను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. కోసిగి సీఐ ఈశ్వరయ్య తన దాయాదులకు వత్తాసు పలుకుతూ తనను బెదిరిస్తూ.. వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.



357 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon