• Neti Charithra

సచివాలయా ల ద్వారా 500 సేవలు- సీఎం జగన్ మోహన్ రెడ్డి

#సచివాలయా ల ద్వారా 500 సేవలు- సీఎం జగన్ మోహన్ రెడ్డి

విజయవాడ/తిరుపతి: నేటి చరిత్ర (సెప్టెంబర్30) ఉద్యోగ నియామక చరిత్రలో సరికొత్త రికార్డ్ అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. నాలుగు నెలల్లోనే 4లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా తీసుకుని పని చేయాలన్నారు. లంచాలు లేని పారదర్శక పాలన అందించాలన్నారు. విజయవాడ, తిరుపతి లలో ఆదివారం సీఎం జగన్ చేతుల మీదుగా సచివాలయ ఉద్యోగులను నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు అనుసంధానం కావాలని జగన్ సూచించారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలన్నారు. అవినీతి లేని పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగులపై పెడుతున్నామని జగన్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్నింటికీ లంచం ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని సూచించారు. 72 గంటల్లో ప్రజల ఫిర్యాదులు పరిష్కరించాలని జగన్‌ పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరిస్తామన్న భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. గ్రామ పాలనా వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉందన్నారు. స్వచ్ఛమైన పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. రెండు నెలల్లో సచివాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జగన్ పేర్కొన్నారు. ప్రతి వలంటీర్‌కు స్మార్ట్‌ఫోన్‌ అందజేస్తామని.. సచివాలయ వ్యవస్థలో 34శాఖలకు చెందిన 500కి పైగా సేవలు అందిస్తామన్నారు. కొత్త ఏడాది నుంచి సచివాలయ ఉద్యోగుల కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. ఒక్క ఆరోపణ కూడా లేకుండా.. పరీక్షలు నిర్వహించిన అధికారులకు జగన్‌ అభినందనలు తెలిపారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon