• Neti Charithra

షోరూమ్ కు వెళ్లి.. టివి కొన్న కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్..!


షోరూమ్ కు వెళ్లి.. టివి కొన్న కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్..!





శ్రీకాకుళం: నేటి చరిత్ర


మూడు మాసాల లాక్ డౌన్ తర్వాత ఎంతో మోజుతో ఎల్ ఈ డి టివి కొనుగోలు చేసిన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ కల కలం రేపిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...

శ్రీ‌కాకుళం జిల్లా టెక్కలి కొడ్రవీధికి చెందిన దంపతులు,  టెక్కలి మెయిన్ రోడ్డులోని ఎలక్ట్రానిక్ షాపులో  వారం రోజుల క్రితం

ఎల్ఈడీ టీవీ కొన్నారు . కొత్త టీవీ కొన్న ఆనందంలో ఉన్న ఆ కుటుంబసభ్యులకు.. ఆ సంతోషం రెండు రోజులే మిగిలింది. ఎల్ఈడీ కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ షాపు యజమానితో పాటు ఆయన కుటుంబంలోని అందరికీ మొత్తం ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో టీవీ కొనుగోలు చేసిన కొడ్రవీధికి చెందిన దంపతులు

షాకయ్యారు . గృహోపకరణాల దుకాణం యజమానికి పలాసలోనూ బ్రాంచి ఉంది . దీంతో నిత్యం పలాస, టెక్కలి మధ్య రాకపోకలు సాగిస్తుంటాడు. ప్రస్తుతం పలాసలో వైరస్ వ్యాప్తితో షాపు యజమానికి కరోనా తగులుకుంది. ఆయన కుటుంబం మొత్తానికి అంటించాడు. షాపు యజమానికి కరోనా నిర్ధారణ అవ్వగానే.. అధికారులు ఆ షాపును మూసేయడంతో పాటు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ చేసారు. 

ఇక‌, ఆ షాపులో వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ను కొనుగోలు చేసిన కస్టమర్లను.. అధికారులు అప్రమత్తం చేశారు. అందరినీ టెస్టులు చేయించుకోవాల్సిందిగా సూచించారు . ఈ క్రమంలో ఎల్ఈడీ టీవీ కొన్న కొడ్రవీధికి చెందిన దంపతులు స్వల్పఅనారోగ్యానికి గురయ్యారు . ఎందుకైనా మంచిదని టెస్లులు చేయించుకున్న ఆ కుటుంబం షాకయ్యింది . టీవీ కొన్న దంపతులతో పాటు వారి కుమార్తె , అల్లుడికి మొత్తం ఇంట్లోని నలుగురికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడిన దంపతుల కుమార్తె టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుండటంతో ఆసుపత్రి సిబ్బందిలో కలవరం మొదలైంది . తమ తోటి సిబ్బందికి పాజిటివ్ రావడంతో అందరూ టెస్టులు చేయించుకున్నారు . అయితే అందరికీ నెగిటివ్ అని రిపోర్టులు రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. టీవీ కొనుగోలు కోసం కేవలం కొన్ని నిమిషాల పాటు ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లో గడిపినందుకే ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడటం అందర్నీ కలవరపరిచింది.


781 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon