• Neti Charithra

షూటింగులు.. సినిమా థియేటర్లు కు..కేంద్రం గ్రీన్ సిగ్నల్..!


షూటింగులు.. సినిమా థియేటర్లు కు..కేంద్రం గ్రీన్ సిగ్నల్..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


దేశ వ్యాప్తంగా ఐదు మాసాల అనంతరం

సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు నిర్వహణకు కేంద్రం అవకాశం కల్పించింది.

తాజాగాఆన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా సినిమాలు, టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా చిత్రీకరణలు

జరుపుకోవచ్చని తెలిపింది. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆదివారం ఉదయం ఓ ప్రకటనలో చిత్రీకరణలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. మొట్టమొదటి లాక్‌డౌన్‌ విధించిన మార్చి 25వ తేదీ నుంచి ఎక్కడి షూటింగ్‌లు అక్కడే నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం కొన్ని రాష్ట్రాల్లో షూటింగులు ప్రారంభించినప్పటికీ  కరోనా ఉద్ధృతి పెరగడంతో నిలిపివేశారు. తాజాగా కేంద్రం ఇచ్చిన అనుమతులతో మళ్లీ సినిమా, టీవీ సీరియల్స్‌ చిత్రీకరణలు ప్రారంభం కానున్నాయి. 


453 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon