• Neti Charithra

శాసన మండలి సెలెక్ట్ కమిటీ లకు పేర్లు ప్రకటించిిిి న ప్రధాన పార్టీలు !

శాసన మండలి సెలెక్ట్ కమిటీ లకు పేర్లు ప్రకటించిిిన ప్రధాన పార్టీలు !

అమరావతి: నేటి చరిత్ర (ఫిబ్రవరి 3)

దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఏపీ

మూడు రాజధానులు ఏర్పాటు తీర్మానానికి సెలెక్ట్ కమిటీలు ఏర్పాటుకు సంబంధించి ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీల పేర్లను ప్రకటించాయి.మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను ఏపీ శాసన మండలి ఛైర్మన్‌ సెలక్ట్‌ కమిటీలకు పంపిన నేపథ్యంలో ఆయా కమిటీల్లో ఉండాల్సిన నేతల జాబితాను పార్టీలు పంపించాయి. తెదేపా, భాజపా, పీడీఎఫ్‌ నుంచి మండలి ఛైర్మన్‌ కార్యాలయానికి ఈ జాబితాలు చేరాయి. ఒక్కో కమిటీలో తెదేపా నుంచి ఐదుగురు.. భాజపా, పీడీఎఫ్‌ నుంచి ఒక్కొక్కరికి మండలి ఛైర్మన్‌ అవకాశం కల్పించారు. దానికి అనుగుణంగా మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులకు ఆయా పార్టీలు పేర్లను పంపాయి. వైకాపా నుంచి ఇంతవరకు ఎలాంటి జాబితా అందక పోవటం ప్రాధాన్యత సంత రించుకొంది.

తెదేపా నుంచి.. మూడు రాజధానుల బిల్లుకు నారా లోకేశ్‌, అశోక్‌బాబు, తిప్పేస్వామి, బీటీ నాయుడు, సంధ్యారాణి.. సీఆర్‌డీఏ బిల్లుకు దీపక్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర, గౌనువారి శ్రీనివాసులు, బుద్ధా వెంకన్న పేర్లను తెదేపా పంపింది. భాజపా, పీడీఎఫ్‌ తరఫున.. భాజపా నుంచి మూడు రాజధానుల బిల్లుకు మాధవ్‌, సీఆర్‌డీఏ బిల్లుకు సోము వీర్రాజు పేర్లను పంపగా.. పీడీఎఫ్ తరఫున మూడు రాజధానులు బిల్లుకు కె.ఎస్‌.లక్ష్మణరావు, సీఆర్‌డీఏ బిల్లుకు ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) పేర్లను ఆ పార్టీ పంపింది.

28 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon