• Neti Charithra

శంషాబాద్ సమీపం లో మరో మహిళ సజీవ దహనం!

#శంషాబాద్ సమీపం లో మరో మహిళ సజీవ దహనం!

హైదరాబాద్‌: నేటి చరిత్ర(నవంబర్30) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డాక్టరు ప్రియాంకరెడ్డి అత్యాచారం, హత్య ఘటన మరవకముందే శంషాబాద్ లో మరో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను హత్య చేసి తగులబెట్టారు. సిద్దులగుట్టకు సమీపంలోని ఓ ప్రధాన రోడ్డుకు పక్కనే అయ్యప్పస్వామి గుడి ఉంది. ఆ గుడి పక్కనే వున్న స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు మహిళను హత్య చేసి తగులబెట్టారు. పూజల నిమిత్తం గుడికి వచ్చిన అయ్యప్ప దీక్షాపరులు ఈ సంఘటనను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగి వుండవచ్చన్న అనుమానాలు తలెత్తాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon