• Neti Charithra

శ్రీవారి ఆలయం లో వైభవంగా పవిత్రోత్సవాలు..!


శ్రీవారి ఆలయం లో వైభవంగా పవిత్రోత్సవాలు..!




తిరుమల: నేటి చరిత్ర



తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి

ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామివార్లకు విశేష సమర్పణ చేశారు.

అనంతరం సాయంత్రం 6.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో

శ్రీమలయప్పస్వామివారిని ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో వేంచేపు చేశారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగాయి. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


54 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon