• Neti Charithra

శ్రీకాళహస్తి లో సిపిఎం- సీపీఐ ల ఆధ్వర్యంలో నిరసనలు..!


శ్రీకాళహస్తి లో సిపిఎం- సీపీఐ ల ఆధ్వర్యంలో నిరసనలు..!




శ్రీకాళహస్తి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాశ్రీకాళహస్తిలో

కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం రాష్ట్ర కమిటీ ల పిలుపుమేరకు సోమవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో లో ని రసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వామపక్ష నాయకులు జన

మాల గురవయ్య గంధం మణి లు మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని ఐసోలేషన్, కోరం టైన్ కేంద్రాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, కరోనా పరీక్షలు చేయించుకున్న వారికి త్వరితగతిన పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర పార్టీల పిలుపులో భాగంగా ఈ

కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరోనా పేషెంట్ లకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మల్లికార్జున్ ,రమేష్, సాయి సిపిఎం నాయకులు గురవయ్య ధనుష్ అశోక్ కిషోర్ ఆర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


47 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon