• Neti Charithra

శ్రీకాకుళం జిల్లా లో బిజెపి సంబరాలు!

#శ్రీకాకుళం జిల్లా లో బిజెపి సంబరాలు!

టెక్కిలి: నేటి చరిత్ర (అక్టోబర్24) మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ విజయదుందుభి మ్రోగించిన నేపథ్యం లో శ్రీకాకుళం జిల్లా టెక్కిలి లో బిజెపి నేతలు గురువారం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మరియు సంస్కరణలుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారన్నారు. ఇదే పరిస్థితి ఇక ముందుకూడా కొనసాగుతుoదని బీజేపీ టెక్కలి నియోజకవర్గం కన్వినిర్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంతు ఉదయ్ భాస్కర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ బలపడుతున్నవిధానం ఎంతో ఉత్తేజ పరుస్తూ నాయకులను ఆకర్షణీయమైన పార్టీగా ఎదిగిందన్నారు. మిఠాయిలు పంచుకొని విజయోత్సవ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిర్విషియానంద స్వామి, RSS సభ్యులు పొలకి లక్మన రావు, ప్రధాన హరిశ్చంద్ర రావు, SJM ఉత్తరాంధ్ర యువ ప్రముఖ్ సిగిలిపెల్లి సాయిబాబు, టెక్కలి బీజేపీ కార్యదర్శి అడవి రాజు, కోటబొమ్మాళి బీజేపీ మండలాధ్యక్షులు బొంతల అప్పయ్య, అంపలాo మాధవ రావు, సతీష్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon