• Neti Charithra

శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా

కార్గిల్ విజయ్ దివస్'..!

శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్..!




టెక్కిలి: నేటి చరిత్ర


శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో

'కార్గిల్ విజయ్ దివస్' కార్యక్రమం

ఆదివారం నిర్వహించారు.ఈ

సందర్భంగా టెక్కలి బీజేపీ కార్యాలయంలో బీజేపీ టెక్కలి నియోజకవర్గo కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతు ఉదయ్ భాస్కర్ మరియు జనసేన టెక్కలి నియోజకవర్గo ఇంచార్జ్ కణితి కిరణ్ భరతమాత చిత్రపఠానికి పూలమాల వేసి వీరమరణం పొందిన 527 మంది సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. 1965, 1971 ఇండో - పాక్ యుద్ధాలకన్నా 1999మే, జూన్ నెలల్లో

జరిగిన అతిపెద్ద యుద్ధం కార్గిల్ యుద్ధం. దీన్ని 'ఆపరేషన్ సఫెది సాగర్' (ఆపరేషన్ వైట్ సీ) అని పేరు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కార్గిల్ యుద్ధ సమయంలో మొదటిసారి పెద్దఎత్తున 527 మంది భారత జవానులు వీర మరణం పొందటం యావత్ భారతావని దిగ్భ్రాంతికి గురయింది, సుమారు 60 రోజుల యుద్ధానంతరం మనం సాధించిన ఘన విజయానికి నిదర్శనంగా భారత ప్రభుత్వం 'విజయ్ దివాస్' అని పేరు పెట్టారు అని అన్నారు. దేశ సరిహద్దుల్లో భద్రతాబలగాల గుండెల చాటున యావత్ భారతీయులు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే వీరజవానుల కుటుంభాలకు ప్రతి భారాతీయుడు ఆజన్మాంతం రుణపడి ఉంటారని ఉదయ్ భాస్కర్ అన్నారు.


29 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon