• Neti Charithra

వైసీపీలో మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్.. పరిస్థితి ఆందోళన కరం.. హెలికాఫ్టర్ లో తరలింపు..!


వైసీపీలో మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్.. పరిస్థితి ఆందోళన కరం.. హెలికాఫ్టర్ లో తరలింపు..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


(హెలికాఫ్టర్ లో బెంగుళూరు చేరుకున్న పిఠాపురం ఎమ్మెల్యే)


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా మహమ్మారి బారినపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు నిన్న కరోనా పాజిటివ్ వచ్చింది. పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి

వైద్యాధికారి విజయ్ శేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు. జ్వరంగా ఉండటంతో ఎమ్మెల్యే దొరబాబు నిన్న ఉదయం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే దొరబాబు కాకినాడలోని ఓ ప్రైవేటు

ఆస్పత్రిలో చేరారు. ఇటీవల తనను కలిసిన నాయకులు, ప్రభుత్వ అధికారులు వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ని అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగుళూరుకు తరలించారు.


858 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon