• Neti Charithra

వైసీపీ లో చేరిన మాజీ తహసిల్దార్ నరసింహులు నాయుడు!

తిరుపతి: నేటి చరిత్ర (డిసెంబర్23)

రాష్ట్ర మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమక్షంలో విశ్రాంత తహశీల్దార్, ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర మాజీ నాయకులు ఎం.నరసింహులు నాయుడు వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకున్నారు. సోమవారం మంత్రి పెద్దిరెడ్డి

రామ చంద్ర రెడ్డి సమక్షం లో మాజీ తహసిల్దార్ నరసింహులు వైసీపీ లో చేరారు.

మంత్రి' పెద్దిరెడ్డి ' పార్టీ కండువాతో నరసింహులు నాయుడును స్వాగతించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. అనంతరం నరసింహులు నాయుడు మాట్లాడుతూ తన శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతాలు, ముఖ్యమంత్రి అమలు చేస్తున్న ప్రజాధరణ పథకాలు నచ్చి పార్టీలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని బంధువు లు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు నా వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. వారి ప్రోత్సాహంతోనే పార్టీలో సమర్ధవంతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తనతో పాటు విశ్రాంత తహశీల్దార్, ఎస్సీ ఉద్యోగుల సంఘం మాజీ నాయకుడు, పెన్షనర్ల సంఘం నాయకులు ధర్మయ్య, ఇతర నాయకులు నాగయ్య పార్టీలో చేరారని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీ ప్రభుత్వంలో వేధింపుల కారణంగా అనేక రుగ్మతలకు గురయ్యారని, అందుకు తానే నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వం రాకూడదని ప్రభుత్వ ఉద్యోగులు కంకణం కట్టుకుని ఉన్నారని చెప్పారు. సీపీస్ రద్దు, ఆర్టీసీ విలీనం, రైతు భరోసా, అమ్మ ఒడి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ఆర్ పార్టీ ప్రజా ప్రభుత్వంగా నిలుస్తోందన్నారు. నరసింహులు నాయుడు చేరిక పట్ల పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో నరసింహులు నాయుడు చేరిక ప్రాధాన్యత సంతరించుకుందని పేర్కొంటున్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు, శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి లను నరసింహులు నాయుడు కలిశారు. పార్టీలో ఆయన చేరికను వారు స్వాగతించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు పోకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

1 view
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon