• Neti Charithra

వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ మంత్రి సిద్ధ రాఘవ రావు!


వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ మంత్రి సిద్ధ రాఘవ రావు!



తాడేపల్లి: నేటి చరిత్ర


ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ హయం లో రోడ్డు రవాణా శాఖ, అటవీశాఖ లకు మంత్రిగా పనిచేసిన

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో

చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌

రెడ్డితో కలిసి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆయన కలిశారు. అనంతరం సీఎం సమక్షంలో శిద్దా, ఆయన కుమారుడు సుధీర్‌ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.గత లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా తరఫున ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శిద్దా రాఘవరావు ఓటమి పాలయ్యారు.


111 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon