• Neti Charithra

వైసీపీ లో కరోనా కల కలం.. మరో మంత్రి తో పాటు..పలువురు ఎమ్మెల్యేలు కు పాజిటివ్..!



వైసీపీ లో కరోనా కల కలం.. మరో మంత్రి తో పాటు..పలువురు ఎమ్మెల్యేలు కు పాజిటివ్..!




అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యే లు వారి కుటుంబ సభ్యుల కు

కరోనా మహమ్మారి వేధిస్తోంది.

రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైరస్‌ బారినపడ్డారు. తాజాగా మరో మంత్రికి పాజిటివ్‌ అని తేలింది. ప్రకాశం జిల్లాకు

చెందిన రాష్ట్ర విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండటంతో ఆయన హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకున్నా రు. తొలుత నెగెటివ్‌ రాగా మరోసారి మంగళవారం సాయంత్రం చేయించుకున్నా పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. ఆయన వెంటనే చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేరారు. జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పాజిటివ్‌ రావడంతో ఇప్పటికే హైదరాబాద్‌ స్టార్‌ ఆస్పత్రిలో

చేరారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌కు పాజిటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆయన భార్యకు కూడా వైరస్‌ ఉన్నట్లు తేలడంతో ఒంగోలులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎపిలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాషా, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి సహా పలువురు వైసిపి ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌ రెడ్డి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కరోనా బారినపడిన విషయం తెలిసిందే.



363 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon