- Neti Charithra
వైసీపీ పాలన లో సంక్షేమం పరుగులు పెడుతోంది- ములకలచేరువు లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..!
Updated: Jan 21
వైసీపీ పాలన లో సంక్షేమం పరుగులు పెడుతోంది- ములకలచేరువు లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..!
ములకలచేరువు: నేటి చరిత్ర
వైసీపీ పాలన లో సంక్షేమం పరుగులు పెడుతోందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ములకలచేరువు లో బుధవారం తంబల్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్ది ద్వారక నాథ్ రెడ్డి తో కలిసి ఆరు మండలాల్లో 32370 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. గతం లో ఎన్నడూ లేని విధంగా పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. తంబల్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్ది ద్వారక నాథ్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబాన్ని
(ములకలచేరువు లో సభలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి)
(డిప్యూటీ సీఎం తోపాటు ముగ్గురు ఎమ్మెల్యే లను గజ మాలతో సత్కరిస్తున్న బి కొత్తకోట వైసీపీ నాయకులు)
ఆదరిస్తున్న విధంగానే తాము కూడా అన్ని విధాలా అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కులాలు మతాలు కు అతీతంగా అందిస్తున్నామన్నారు
. చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, మదనపల్లె, పీలేరు ఎమ్మెల్యే లు నవాజ్ బాషా, చింతల రామచంద్రారెడ్డి లు మాట్లాడుతూ 18 మాసాల్లో నవరత్నాల హామీ ని నెరవేర్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి దే నన్నారు. కార్యక్రమం లో పలు శాఖల అధికారులు తో పాటు ఆరు మండలాలకు చెందిన వైసీపీ నేతలు , ప్రజలు హాజరు అయ్యారు.