• Neti Charithra

వైసీపీ ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి- ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా

#వైసీపీ ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి- ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా

వైసీపీ ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి అని ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. చిత్తూరుజిల్లా మదనపల్లె లో ఆయన ఆదివారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయనకు మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ భాషతో పాటు వైసీపీ శ్రేణులు, మైనార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా మదనపల్లె లోని టిప్పు సుల్తాన్ మసీదును అక్కడి స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గతం లో ఏ సీఎం కూడా మైనార్టీల ఫై చూపని ఆదరాభిమానాలు ను ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి చూపుతున్నారని .. ముఖ్యంగా ఐదు మంది మైనార్టీ లను ఎమ్మెల్యే లుగా చేసి డిప్యూటీ సీఎం గా మైనారిటీలకు చేసిన ఘనత వైసీపీ దే నన్నారు. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే సీఎం జగన్ ధేయం అని .. నవరత్నాల అమలుతో సీఎం జగన్ ప్రజల హృదయాల లో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. ఈసందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. కార్యక్రమాల్లో వైసీపీ నేతలు ఇర్ఫాన్ ఖాన్, దండు కరుణాకర్ రెడ్డి,రఫిక్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon