• Neti Charithra

వైసీపీ పై మండి పడ్డ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి!

#వైసీపీ పై మండి పడ్డ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి!

జమ్మలమడుగు: నేటి చరిత్ర (అక్టోబర్26) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం కోసం కృషి చేస్తామని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పోటీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. శనివారం నాడు జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో పర్యటించిన ఆది మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆది సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని.. కొందరిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆది ఆరోపించారు ‘కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధికి పాటుపడదాం. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అమరావతి వివిధ ప్రభుత్వ పథకాలను శంకిస్తూ ఉంది. డి.ఎం.ఎఫ్ నిధులను బ్లాక్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు రాష్ట్రంలో కేవలం పులివెందుల, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే బిల్లులు చెల్లించడం దారుణం. గండికోట నిర్వాసితులకు ఆర్. అండ్.ఆర్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించి ఉంటే గండికోటలో మరిన్ని నీళ్లు నిలబెట్టే అవకాశం ఉండేది’ అని ఆదినారాయణరెడ్డి తెలిపారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon