• Neti Charithra

వైసీపీ కార్యకర్త దారుణ హత్య !

#వైసీపీ కార్యకర్త దారుణ హత్య !

ఏలూరు: నేటి చరిత్ర (నవంబర్15) తూర్పు గోదావరి జిల్లా భీమడోలు మండలం అంబరుపేటలో వైసీపీ కి చెందిన పార్టీ కార్యకర్త శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. భూవివాదం నేపథ్యంలో పసుపర్తి కిశోర్‌పై దుండగులు రాడ్లతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన కిశోర్‌ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సోదరుడు గోపాలం ప్రోద్బలంతో టీడీపీ నాయకులు దాడిచేసి చంపారని కిశోర్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon