• Neti Charithra

వైసీపీ ఎంపీ లకు.. సీఎం జగన్ దశా.. నిర్దేశం!

#వైసీపీ ఎంపీ లకు.. సీఎం జగన్ దశా.. నిర్దేశం!

తాడేపల్లి : నేటి చరిత్ర (నవంబర్15) తాడేపల్లె లోని క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం వైసిపి పార్లమెంటరీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ స‌మావేశానికి వైసిపి ఎంపీలు హాజ‌రయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్రం నుంచి రావలసిన నిధులు , ఇతరగ్రాంట్లపై ప్రధానంగా ఎంపీలు దృష్టి సారించాలని, బొగ్గు గ‌నుల కేటాయింపులు త్వరగా పూర్తిచేయాలని, ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిధులు , ఇతర విభజన అంశాలపై ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon