• Neti Charithra

విశాఖ విష వాయువు లీకేజీ లో .. 14 కు చేరిన మృతుల సంఖ్య !


విశాఖ విష వాయువు లీకేజీ లో .. 14 కు చేరిన మృతుల సంఖ్య !



విశాఖ: నేటి చరిత్ర


విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన అక్కడి చుట్టుపక్కల గ్రామాల వారిని ఇంకా భయపెడుతూనే ఉంది. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు ప్రభావం కారణంగా వెంకటాపురానికి చెందిన 13 మంది మృతి చెందగా, తాజాగా యలమంచిలి కనకరాజు(45) అనే కార్పెంటర్‌ మృతి

చెందడంతో మృతుల సంఖ్య 14 కు చేరింది.

సీపీఎం గోపాలపట్నం డివిజన్‌ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీ 92వ వార్డు వెంకటాపురం గ్రామానికి చెందిన యలమంచిలి కనకరాజు కార్పెంటర్‌గా పనిచేస్తుండేవాడు. గత నెల 7వ తేదీన జరిగిన గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందాక ఇంటికి తిరిగి వచ్చారు. అయితే రెండు రోజులుగా

ఆయాసం, కడుపు ఉబ్బరంతో ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సోమవారం ఆసుపత్రిలో చేర్పించేందుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారని సమాచారం. విషవాయువు ప్రభావం వల్లే ప్రాణాలు కోల్పోయారని కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు.





27 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon