• Neti Charithra

విశాఖ లో... విషాదం... ఘటనా స్థలానికి సీఎం జగన్... లైవ్ దృశ్యాలు.. నేటి చరిత్ర.. లో!


విశాఖ లో... విషాదం... ఘటనా స్థలానికి సీఎం జగన్... లైవ్ దృశ్యాలు.. నేటి చరిత్ర.. లో!



విశాఖ: నేటి చరిత్ర


ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ లో పెను విషాదం నెలకొంది. ఓ ఫ్యాక్టరీ లో విష వాయువు బయట కు లీక్ కావడం తో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం.


కాగ ఈ ప్రమాదం లో రసాయన వాయువు లీక్ కావడంతో సుమారు 300 మంది కి పైగా అస్వస్థత కు గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకున్న సీఎం జగన్ మోహసన్ రెడ్డి హుటాహుటిన విశాఖ కు వెళ్లనున్నారు. ఇందుకు సమ్బసంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


(విశాఖ లో విషాదం.. ప్రమాద ఘటన కు ససంబంధించిన లైవ్ )



విశాఖ లోని

ఎల్ పీజీపాలిమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్‌ అవడంతో విశాఖ నగరం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది. నగరంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర వాయువు వ్యాపించింది. తెల్లవారుజామున 3గంటల సమయంలో గ్యాస్‌ లీక్‌ అవడంతో ఆసమయంలో అందరూ నిద్రమత్తులో ఉన్నారు. రసాయన వాయువు ప్రభావంతో ఉక్కిరి బిక్కిరి అయిన స్థానికులు రోడ్లపైకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈక్రమంలో కొందరు అపస్మారక స్థితికి చేరుకుని రోడ్లపైనే పడిపోయారు. ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తే క్రమంలో గంగరాజు అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. మరికొందరు బయటకు రాలేక ఇళ్లలోనే ఉండిపోయారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. రసాయన వాయువు పీల్చి నురగలు కక్కుతూ పశువులు నేలకొరిగాయి. వందలాది పశువులు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.



278 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon