• Neti Charithra

విశాఖ ప్రమాదం పై .. స్పందించిన పలువురు.. సీఎం లు!


విశాఖ ప్రమాదం పై .. స్పందించిన పలువురు.. సీఎం లు!



విశాఖ: నేటి చరిత్ర



సిఎం జగన్‌ విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో గ్యాస్‌ లీకైన ఘటనపై పరిస్థితులను దగ్గరుండి తెలుసుకునేందుకు తాడేపల్లి నుంచి విశాఖ కు చేరుకున్నారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. అలాగే, ఆసుపత్రుల్లో చేరి, చికిత్స తీసుకుంటున్న వారిని పరామర్శిస్తారు. కాగా గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు సమాచారం.
విశాఖ వెళ్లేందుకు ఆయన కొద్ది సేపటి క్రితం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు.
బాధితులను పరామర్శించి, అలాగే, సహాయక చర్యల్లో పాల్గొంటామని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే వెంటనే ఆయన విశాఖ బయలుదేరుతారు.
కాగ విశాఖ ప్రమాదం పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , ఆర్థిక శాఖ మంత్రి నిర్మల రామన్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, తెలంగాణా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు విచారం వ్యక్తం చేశారు.


90 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon