• Neti Charithra

విశాఖ డాక్టర్ సుధాకర్ వివాదం లో కొత్త కోణం.. డాక్టర్ పై కేసు నమోదు చేసిన సీబీఐ !


విశాఖ డాక్టర్ సుధాకర్ వివాదం లో కొత్త కోణం.. డాక్టర్ పై కేసు నమోదు చేసిన సీబీఐ !




విశాఖ : నేటి చరిత్ర


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ సుధాకర్ వివాదంపై సిబిఐ కేసు నమోదు చేసింది. గత నెల 16న మద్యం మత్తులో విశాఖపట్నంలోని జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారని సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై వివిధ ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు స్పందించి

హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు సుధాకర్‌ ఘటనపై సిబిఐ విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజులుగా విచారణ జరుపుతున్న కానిస్టేబుల్‌ వెలగల వెంకటరమణ ఫిర్యాదు మేరకు సిబిఐ జాతాగా డాక్టర్‌ సుధాకర్‌పై కేసు నమోదు

చేసింది. ఘటన జరిగిన సమయంలో విశాఖ నాలుగో పట్టణ పోలీసులు 353, 427, 506 సెక్షన్ల కింద సుధాకర్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దాని ఆధారంగానే సిబిఐ కేసు నమోదు చేసింది. నేరపూరితమైన బలం ఉపయోగించి విధులకు ఆటంకం

కలిగించారని, తుంటరి చేష్టలు, భయోత్పాతం సృష్టించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇవాళ సిబిఐ వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఐఆర్‌ కాపీని అందుబాటులో ఉంచారు.

167 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon