• Neti Charithra

విశాఖలో మద్యం మత్తులో.. స్పీరిట్ తాగి ఐదుకు చేరిన మృతుల సంఖ్య !



విశాఖలో మద్యం మత్తులో.. స్పీరిట్ తాగి ఐదుకు చేరిన మృతుల సంఖ్య !


విశాఖ : నేటి చరిత్ర



విశాఖ జిల్లా కశింకోటలో స్పిరిట్‌ తాగిన ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఎక్కువ మత్తు ఇస్తుందనే ఉద్దేశంతో వీరంతా స్పిరట్‌

తాగారు. కశింకోట మండల కేంద్రానికి చెందిన అయిదుగురు వ్యక్తులు శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. వీరిలో ఒకరు మందుల కంపెనీలో కార్మికుడు కావడంతో అక్కడి నుంచి గుట్టుగా సర్జికల్‌ స్పిరిట్‌ తీసుకొచ్చాడు. దానిని వారంతా తాగి ఆపై ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఆదివారం ఉదయాన్నే కడుపులో మంట వస్తోందంటూ కునిశెట్టి ఆనంద్‌(55), వడిశల

నూకరాజు(61), పెతకంశెట్టి అప్పారావు(50) అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. వీరిలో ఆనంద్‌, నూకరాజు ఇంటిలోనే మృతిచెందగా.. అప్పారావు విశాఖపట్నం కేజీహెచ్‌లో మృతిచెందారు. స్పిరిట్‌ తాగిన మాణిక్యం, దొరబాబు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయారు.


59 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon