• Neti Charithra

వాల్మీకిపురం పోలీసుల తీరును నిరసిస్తూ..ప్రజా సంఘాల నిరసనలు..!


వాల్మీకిపురం పోలీసుల తీరును నిరసిస్తూ..ప్రజా సంఘాల నిరసనలు..!


మదనపల్లె: నేటి చరిత్ర


వాయల్పాడు మండలం చింతపర్తి పంచాయితీ కోటపల్లి లో గొర్రెల కాపరి రవి ని హత్య చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి,మృతుడు రవి భార్య ను విచక్షణ రహితంగా కొట్టి చిత్రహింసకు గురిచేసిన వాల్మీకిపురంపోలీసులను తక్షణమే విదులనుండి తొలగించి వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని


చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాలు నిరసనకు దిగాయి. ఈ సందర్భంగా సీపీఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ,దళిత హక్కుల పోరాట సమితి నాయకులు క్రిష్ణప్ప,బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ చందు,కురభ సంఘం నాయకులు భాస్కర్,నారాయణ బాబు,మాల మహనాడు జిల్లా సహయ కార్యదర్శి కోన భాస్కర్ మాట్లాడుతూ మృతుడు రవి అదే గ్రామానికి చెందిన ధన శేఖర్ రెడ్డి కి 3 లక్షలు రూపాయలు అప్పుగా యిచ్చాడని ఇంకా ఇతరుల దగ్గర కూడా అప్పుడు తీసిచ్చాడని ఇచ్చిన డబ్బులు అడిగినందుకు,అప్పు చెల్లించే పరిస్థితులో లేని అగ్ర కులానికి చెందిన ధన శేఖర్ రెడ్డి ,అతని అనుచరులు రవి ఆగస్టు నెల 25 వ తేదీన పథకం ప్రకారం హత్య చేశారని వారు ఆరోపించారు. కేసులో రాజీ కావాలని మృతుడు రవి భార్యను పోలీసులు విచక్షణ రహితంగా కొట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బాదితులకు అండగా నిలవాల్సిందిపోయి అగ్రకులానికి చెందిన వారికి అండగా ఉంటుంన్నారని విమర్శించారు. రవి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మదనపల్లి

డియస్పి గారికి వినతిపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో రవి కుటుంబ సభ్యులు కిరణ్ కుమార్,గోపాల్ కురబ సంఘం నాయకులు జి.వి.శివ కుమార్ రామాంజులు జగన్,సురేష్,శంకర్,నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రభాకర్,లక్ష్మిపతి,సీపీఐ నాయకులు రాజ్ కుమార్,ఏఐటీయూసీ నాయకుడు ముబారక్,తదితరులు పాల్గొన్నారు


259 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon