• Neti Charithra

వాల్మీకి జయంతి వేడుకల్లో.. మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా..!


వాల్మీకి జయంతి వేడుకల్లో.. మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో

వాల్మీకి జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థి గా హాజరు ఆయిన ఎమ్మెల్యే నవాజ్ నవాజ్ బాషా

మాట్లాడుతూవాల్మీకులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ది చేయాలన్నదే రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక వాల్మీకి వీధి నందు రాష్ట్ర ప్రభుత్వం తరపున

నిర్వహించిన శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా

పాల్గొన్న ఆయన శ్రీ వాల్మీకి విగ్రహానికి పూల మాల వేసి ప్రత్యేక పూజలు చేశారు.

రాష్ట్రంలోని బి.సి.లు అందరూ వై.ఎస్. ఆర్. కుటుంబంతో ఉంటేనే బి.సి.లకు న్యాయం జరుగుతుందని వై.ఎస్.ఆర్. సి.పి పార్టీకు మద్దతు ఇవ్వడం జరిగిందని, వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాష్ట్రంలో బి.సి.ల కులాలు 56 కార్పొరేషన్ లు, 630 డైరెక్ట్ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.వా ల్మీకి కులానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర మంత్రి

వర్గంలో ఒక మంత్రి పదవిని ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అందరినీ సమానంగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి భారతదేశం ఎవరైనా ఉన్నారా అంటే అది ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. వాల్మీకులు బాణం పట్టిన చేతులతో బలపం పట్టి బాగా చదువుకొని కలెక్టర్లు, ఎస్ పి లు , రాజకీయ నాయకులుగా ఆర్థికంగా ఆబివృద్ది చెందాలన్నదే ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్బంగా వాల్మీకి జయంతిలో పాల్గొన్న వాల్మీకి నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జింకా చలపతి, వాల్మీకి నాయకులు నరసింహలు,కృష్ణ మూర్తి,హరి,మునిరాజు, రెడ్డెప్ప, వై.ఎస్. ఆర్. సి.పి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


111 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon