• Neti Charithra

వాలంటీర్లు వద్ద"లంచం" తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు పట్టు పడ్డ ఎంపీడీఓ..!



వాలంటీర్లు వద్ద"లంచం" తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు పట్టు పడ్డ ఎంపీడీఓ..! శ్రీకాకుళం: నేటి చరిత్ర


(ఏసీబీ కి పట్టు పడ్డ ఎంపీడీఓ)


గ్రామ వలంటీర్లు ను విధుల నుంచి తొలగించి మళ్ళీ విధుల్లోకి తీసుకునేందుకు

లంచం తీసుకున్న ఎంపీడీఓ ను ఎసిబి అరెస్ట్ చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.శ్రీకాకుళంఏసీబీ డీఎస్సీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం. ఒడ్డంగి గ్రామానికి చెందిన నలుగురు వాలంటీర్లను ఎటువంటి

కారణాలు లేకుండా ఆగస్టు 19న ఇన్‌ఛార్జి ఎంపీడీవో నిమ్మల మాస విధుల నుంచి తొలగించారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు ఆయనతో ఫోన్లో సంభాషించగా నలుగురూ కలిసి రూ.20 వేలు ఇస్తే తిరిగి విధుల్లోకి తీసుకుంటానని డిమాండ్‌ చేశారు. రూ.10 వేలు మాత్రమే ఇవ్వగలమని వాలంటీర్లు తెలిపారు. అనంతరం బాధిత వాలంటీర్లు శ్రీకాకుళం అనిశా డీఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. బుధవారం

మనుమకొండలోని ఎంపీడీవో ఇంటిలో రూ.10 వేలు తీసుకుంటుండగా అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించి విశాఖ ఏసీబీ కోర్టుకు తరలించారు. గ్రామ వలంటీర్లు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టు పడిన కేసు ఏపీ లో ఇదే మొదటిది కావడం విశేషం.



780 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon