• Neti Charithra

వెలుగు పాఠశాల లో ఘనంగా మానసిక ఆరోగ్య దినోత్సవం!

#వెలుగు పాఠశాల లో ఘనంగా మానసిక ఆరోగ్య దినోత్సవం!

మదనపల్లె: నేటి చరిత్ర (అక్టోబర్11) చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కోళ్ళబైలు పంచాయితీ, అమ్మచెరువుమిట్ట నందు గల వెలుగు ప్రత్యేక పాఠశాల నందు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మదనపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా వెలుగు ప్రత్యేక పాఠశాలకు శ్రీమతి ఎస్ సి కమల ,1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మరియు ఎన్ విజయ్ బాబు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ న్యాయ మూర్తులు హాజరు కాగ పుష్పగుచ్చాలతో వారికీ స్వాగతం పలికారు . ఈ కార్యక్రమాన్ని వెలుగు కన్వీనర్ శ్రీమతి భగలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ సందర్బంగా శ్రీమతి ఎస్ సి కమల మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మానసికంగా , ఆరోగ్యాంగా ఉన్నపుడే దైనందిన కార్యక్రమాలు సక్రమంగా సాగుతాయని తెలిపారు. విజయ్ బాబు గారు మాట్లాడుతూ ప్రపంచం లో వీరిని మానసిక వికలాంగులు అని అనకుండా వారిని గిఫ్టేడ్ పిల్లలుగా చూసుకోవాలని వారికీ మానసిక ప్రశాంతతను కలిగేటట్లు ప్రతి ఒక్కరు చూసుకోవాలని తెలిపారు తరువాత పిల్లలతో మాట్లాడి, బిస్కెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో 1 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్ సి కమల , ఎన్. విజయ్ బాబు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ,వెలుగు సంస్థ కన్వీనర్ భాగ్య లక్ష్మి , సోషల్ వర్కర్ గీత వెలుగు సిబ్బంది మరియు చిన్నారులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon