• Neti Charithra

వెలుగు పాఠశాల లో ఘనంగా ప్రపంచ ద్రుష్టి దినోత్సవం!

#వెలుగు పాఠశాల లో ఘనంగా ప్రపంచ ద్రుష్టి దినోత్సవం!

మదనపల్లె: నేటి చరిత్ర (అక్టోబర్16) చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్ట నందు గల వెలుగు ప్రత్యేక పాఠశాల నందు ప్రపంచ దృష్టి దినోత్సవం (వరల్డ్ సైట్ డే ) సందర్బంగా L .V ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది వెలుగు చిన్నారులకు చిత్ర లేఖనం లో పోటీ నిర్వహించారు . ప్రపంచ దృష్టి దినోత్సవం (వరల్డ్ సైట్ డే )సందర్బంగా L .V .ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది ఆప్టోమెట్రిస్ట్ జె .ఆర్ .వెంకటేష్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ యాస్మిన్ , ఎఫ్ .ఎస్ .ఓ. శ్రీ భాస్కర్ , సాంబ శివ ,వెలుగు పాఠశాలకు విచ్చేసినారు. వరల్డ్ సైట్ డే సందర్బంగా వెలుగు చిన్నారులకు నేత్రం మరియు కంటి నిర్మాణం యొక్క చిత్రపటాలను గీయడంలో పోటీ నిర్వహించారు. చిత్రలేఖనంలో గెలుపొందిన వారికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బి.టి. కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ మునిరత్నం నాయుడు , బి.టి.కాలేజీ ఛైర్మెన్ శ్రీ రవి చంద్ర నాయుడు బహుమతులు అందజేశారు. శ్రీ మునిరత్నం నాయుడు మాట్లాడుతూ దివ్యంగులైన చిన్నారులు ఎంతో నైపుణ్యంతో బొమ్మలు వేశారని, దివ్యంగులైనప్పటికీ సాధారణ పిల్లల వలే తమ దైనందిన కార్యక్రమాలు అన్ని నిర్వహించుకోవడం, చదువు పట్ల ఆసక్తి కలిగి చదువు కోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇంతమంది దివ్యంగులందరిని ఆదరిస్తున్న శ్రీ ఉదయ్ మోహన్ రెడ్డి , శ్రీమతి భాగ్యలక్ష్మి లను వారు అభినందించారు. అనంతరం చిత్రలేఖనంలో గెలుపొందిన కె. శ్యామ్, పి. నాగేంద్ర బాబు, ఎ. ఎస్. రాజీవుల్లా , పి. టిప్పు సుల్తాన్ లకు పెన్నులను బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న అందరికి కూడా L.V .ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్భంది పెన్నులను అందజేశారు . వెలుగు ప్రత్యేక పాఠశాల మరియు వృద్ధాశ్రమమునకు " వై .ఎస్ .ఆర్ . కంటి వెలుగు" పథకంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు గల ఆశ వర్కర్లు విచ్చేసి దివ్యంగులందరికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో L .V .ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది వృద్ధ మహిళలందరికీ నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్భంది శ్రీ జె.ఆర్. వెంకటేష్ , యాస్మిన్ , భాస్కర్ , సాంబ శివ , మరియు బి టి కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ మునిరత్నం నాయుడు , శ్రీ రవి చంద్ర నాయుడు, యం.పి.హెచ్.ఓ. శ్రీనివాసులు రెడ్డి , ఎ. ఎన్. యం. లక్ష్మి దేవి , ఆశావర్కర్లు కె. రెడ్డి రాణి , మిస్ గ్రేసీ, సులోచన, శంకరమ్మ, జి. పద్మావతి , వెలుగు సెక్రటరీ , వెలుగు కన్వీనర్ శ్రీమతి భాగ్య లక్ష్మి ,వెలుగు సిబ్భంది చిన్నారులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon