• Neti Charithra

విలేఖర్ల సమావేశం లో కార్యకర్త పై చేయి చేసుకున్న మాజీ సీఎం సిద్ద రామయ్య.....

#విలేఖర్ల సమావేశం లో కార్యకర్త పై చేయి చేసుకున్న మాజీ సీఎం సిద్ద రామయ్య..

బెంగళూరు : నేటి చరిత్ర (సెప్టెంబర్4) కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తమ పార్టీ కార్యకర్తను చెంపపై కొట్టిన ఘటన మైసూరు విమానాశ్రయం వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతుండగా పక్కనే ఉన్న పార్టీ కార్యకర్త ఫోన్‌లో మాట్లాడాల్సిందిగా ఆయనను కోరారని, ఫోన్‌ను ఆయన చెవి దగ్గర పెట్టడానికి యత్నిస్తుండగా సిద్ధరామయ్య ఆ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారని సహాయకుడు తెలిపారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలోనూ కాంగ్రెస్‌ మహిళా కార్యకర్త పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

9 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon