• Neti Charithra

వేరుశనగ రైతుల కు రూ.25 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలి- ములకలచేరువు లో రైతు సంఘం డిమాండ్..!


వేరుశనగ రైతుల కు రూ.25 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలి- ములకలచేరువు లో రైతు సంఘం డిమాండ్..!



ములకలచేరువు: నేటి చరిత్ర


తంబళ్లపల్లెనియోజకవర్గంలో అతివృష్టి కారణంగా నష్టపోయిన వేరుశెనగ పంట రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.

ఎల్.నరసింహులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి యస్. మనోహర్ రెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములకలచేరువు లో ఆదివారం సిపిఐ, రైతుసంఘం ప్రతినిధులు మొలకలచెరువు మండలంలోని,పెద్ద పాలెం గ్రామ పంచాయతీలో రైతుల పొలాల వద్దకు వెళ్లి నష్టపోయిన వేరుశనగ పంటను పరిశీలించారు. రైతులతో పంట పెట్టుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురుస్తాయని ఆశతో,గత సంవత్సరంలో కంటే ఎక్కువ మోతాదులో రైతులు వేరుశనగ పంటను వేయడం జరిగిందని,అయితే వర్షాలు ఎక్కువగా కురిసిన కారణంగా పంట దిగుబడి తగ్గిపోయి,చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని అన్నారు. అలాగే కరోనా లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలకు వలస వెళ్ళిన టువంటి రైతులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా తమ స్వగ్రామాలకు చేరుకొని, పట్టణాలలో కొద్దోగొప్పో కష్టపడి కూడా పెట్టుకున్న నగదును వేరుశనగ పంట మీద పెట్టుబడి పెట్టారని, తీరా పంట దిగుబడి లేక పోయే సరికి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన చెందారు.ఎకరాకుముప్పై నుంచీ నలభై వేలవరకూ పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని వాపోయారు. అతివృష్టి అనావృష్టి వల్ల తీవ్ర వరుసకరువులతో పడమటి ప్రాంతంలోని రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి వేరుశనగ పంట నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారం చెల్లించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లాసమితి సభ్యులు మురళి, రైతు సంఘం నాయకులు ఎండపల్లి.వెంకటరమణ,కె.అంజనప్ప తదితరులు పాల్గొన్నారు.


132 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon