• Neti Charithra

వేరుశనగ పంట రైతులను ఆదుకోవాలని.. మదనపల్లె లో నిరసనలు..!


వేరుశనగ పంట రైతులను ఆదుకోవాలని.. మదనపల్లె లో నిరసనలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


వేరుశనగ పంట రైతులను ఆదుకోవాలి అని

కోరుతూ చిత్తూరు జిల్లా మదనపల్లె లో సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పడమటి మండలాల్లో వర్షాల కారణంగా నష్టపోయిన వేరు శనగపంట

రైతులను ఆదుకొని,ఎకరాకు 25 వేల రూపాయల నష్ట పరిహారం ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని సీపీఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణప్ప లు కోరారు.

గురువారం నిమ్మనపల్లి మండలం,కొండయ్యగారిపల్లి.పంచాయితీలో నష్టపోయిన వేరుశనగపంటను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు

మాట్లాడుతూ ఎకరాకు దాదాపు 30 వేల దాక ఖర్చుపెట్టి పంట చేతికి వస్తే చేసిక అప్పులు తీర్చుకుందామని కలలు కంటున్న వేరుశనగ పంట రైతుల పరిస్థితి వర్షాల కారణంగా పంట దిగుబడి సక్రమంగా రాక కల కలగానే మిగిలిపోయిందన్నారు. పడమటి మండలాల్లో టమోటా తర్వాత ఎక్కువుగా వేరుశనగ పంటను వేస్తారని, గత ఏడాది ఎకరాకు 20 బస్తాలు వస్తే ఈ ఏడాది ఎకరాకు 4 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. వేరుశనగపంట రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. జిల్లా కలెక్టర్,మదనపల్లి సబ్ కలెక్టర్ నష్ట పోయిన వేరుశనగ పంటను పరిశీలించి,రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు రెడ్డి శివ క్రిష్ణ,అన్నమయ్య,ప్రసన్న కుమార్,రెడ్డి ఖాసిం ఖాన్,నరసంహులు,కాదర్ బి,అల్లాబక్షూ,అరుణమ్మ,మల్లీశ్వరి,చిన్నపాప తదితరులు పాల్గొన్నారు


113 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon