• Neti Charithra

వారపు సంత లో ఆక్రమణలు తొలగించాలని.. మున్సిపాలిటీ అధికారులను ముట్టడించిన ప్రజా సంఘాలు!


వారపు సంత లో ఆక్రమణలు తొలగించాలని.. మున్సిపాలిటీ అధికారులను ముట్టడించిన ప్రజా సంఘాలు!




మదనపల్లె: నేటి చరిత్ర

మదనపల్లె లో వారపు సంత ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉందని అందుకోసం 21న జరిగే ఛలో వారపు సంతను జయప్రదం చేయాలని వివధ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. వారపు సంతలో ఆక్రమణలు

తొలగించాలని మదనపల్లి అభివృద్ధి వేదిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆకుకూరలు, కూరగాయలను రోడ్డుపైన పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శ్రీనివాసులు, సిపియం

నాయకులు టి.హరీంద్రనాథ్ శర్మ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణప్ప, సిపిఐ పట్టణ కార్యదర్శి మురళి, బి ఎస్ పి నాయకులు బందెల గౌతమ్ కుమార్, వి సి కే పార్టీ నాయకులు శ్రీ చందు, సిఐటియు పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్ రెడ్డి, భారతీయ అంబేద్కర్ సేన నాయకులు ముత్యాల మోహన్, మాలమహానాడు నాయకులు యమలా సుదర్శనం, ఐటియుసి నాయకులు జి.కృష్ణమూర్తి, కెవిపిఎస్ నాయకులు బి.రఘునాథ్, వీధి వ్యాపారుల సంఘం నాయకులు రామాంజులు, కూరగాయలు ఆకుకూరల వ్యాపారుల సంఘం గౌరవాధ్యక్షులు కంగేరి నంద తదితరులు ప్రసంగించారు. ఒకటో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జి.రవి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ లతో మాట్లాడి తొలగింపు పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ వారపు సంత అనేది ఎవరైనా వ్యాపారం చేసుకోవడానికి ఉద్దేశింపబడినదని అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని వివరించారు. పలుకుబడి ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులు గోడౌన్లను నిర్మిస్తు ఉంటే మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. 20వ తేదీ వరకు మున్సిపల్ అధికారులకు

సమయం ఇస్తున్నామని ఈలోపు సంతలో అక్రమ తొలగించకపోతే మదనపల్లి అభివృద్ధి వేదిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించడానికి సిద్దపడతామని హెచ్చరించారు. వారపుసంతను కాపాడుకోవడానికి ఈ నెల 21న ఛలో వారపుసంత కు అన్ని సంఘాలు నిర్ణయించాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.


120 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon