• Neti Charithra

వ్యవసాయ బోర్లు కు మీటర్ లు బిగించే నిర్ణయానికి వ్యతిరేకంగా ములకలచేరువు లో నిరసనలు..!


వ్యవసాయ బోర్లు కు మీటర్ లు బిగించే నిర్ణయానికి వ్యతిరేకంగా ములకలచేరువు లో నిరసనలు..!వ్యవసాయ బోర్లు కు మీటర్ లు బిగించే నిర్ణయానికి వ్యతిరేకంగా ములకలచేరువు లో నిరసనలు..!ములకలచేరువు: నేటి చరిత్ర


రాష్ట్రంలోని రైతుల వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించి విద్యుత్ చార్జీలు వసూలు చేయాలనే రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేఖంగా,భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మరియు ఏ.పీ రైతుసంఘం రాష్ట్ర సమితుల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా

ములకలచేరువు లో సోమవారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. స్థానిక

వ్యవసాయ మార్కెట్ ఎదుట,నిరసన ప్రదర్శనలో వక్తలు మాట్లాడుతూ

రైతుల బోర్లకు మీటర్లు అమర్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని,ఇదివరకూ

జరుగుచున్న ఉచిత విద్యుత్ విధానాన్ని కొనసాగించాలని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు నశించాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమాన్నుద్దేశించి సీపీఐ నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ; రైతులకు ఉచిత విద్యుత్ విధానాన్ని రద్దు చేసే విధంగా జీవో నెంబర్ 22ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీని ద్వారా నగదు బదిలీ పథకాన్ని అమలు జరపాలని

నిర్ణయించిందన్నారు.అందువల్ల రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ విధానం నష్టపోవడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం విధించిన ఉచ్చులో రాష్ట్ర ప్రభుత్వం రైతులను బలి చేస్తున్నదనివాపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రెండు శాతం అప్పుల కొరకు కేంద్ర ప్రభుత్వం విధించిన షరతుల లో భాగంగా ఉచిత విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నదని ఆరోపించారు. రైతులను నట్టేట నుంచే నగదు బదిలీ పథకం వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు.అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ ఉచిత విద్యుత్ తీసుకొస్తే ఇప్పుడున్న వైసిపి ప్రభుత్వం YSJ రద్దు చేయడం దారుణం అన్నారు.కరోనా ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ -23%నికి పడిపోతే కేవలం వ్యవసాయ రంగం మాత్రమే 5 శాతం వృద్ధిరేటును సాధించింది. అటువంటి వ్యవసాయరంగాన్ని ఈరోజు కుప్ప కూల్చడం తగదన్నారు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. అదే విధంగా మొత్తం ప్రజానీకానికి అన్నం పెట్టి,ఆకలి తీర్చే వ్యవసాయ రంగాన్ని కుదేలు పరచడం భవిష్యత్తులో ఆహార సంక్షోభాన్ని సృష్టిస్తుందని అన్నారు.నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు వ్యవసాయ రంగానికి నూటికి నూరు శాతం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ వుంటే మన దేశంలో మాత్రం వున్న సబ్సిడీలను తొలగించడం దారుణమన్నారు.రైతులకు ఇస్తున్న ఉచిత విధ్యుత్ కొరకు ఎంతఖర్చు పెడుచున్నదీ ప్రపంచానికి తెలియచేసి,రైతులను అవమానం చేయడానికే జగన్మోహరెడ్డి కంకణం కట్టుకున్నారని విమర్శించారు. రైతుసంఘం నియోజకవర్గ అధ్యక్ష,కార్యదర్శిలు ఎండపల్లి.వెంకటరమణ కె. అంజనప్పలు మాట్లాడుచూ; నేటి కరోనా సంక్షోభం కాలంలో వ్యవసాయ రంగాన్ని మరియు దాని అనుబంధ రంగాలను వృద్ధి చేయడమొక్కటే దేశ భవిష్యత్తుకు మార్గం అన్నారు.రాయలసీమలోని మెట్ట ప్రాంత రైతులు బోర్లు మీద నే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నారని, అహర్నిశలు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నకిలీ విత్తనాలు, మరియు ఎరువుల సమస్యలను ఎదుర్కొని పంటలు పండించి సరుకులు మార్కెట్ కి తీసుకొని వస్తే దళారుల చేతిలో మోసపోతున్న రైతన్నలకు ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైందన్నారు. వ్యవసాయ రంగాన్ని కుదేలు పరచడం తిరోగమన చర్యగా భారత దేశ ప్రజలు భావిస్తున్నారని,వ్యవసాయ రంగాన్ని మరిన్ని సబ్సిడీలతో ప్రోత్సహించాల్సిన బదులు ఉచిత విద్యుత్ విధానాన్ని రద్దు చేయడం చాలా దారుణం అని ఆవేదన చెందారు. భవిష్యత్తులో ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని కలుపుకుని పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.మరొక బషీర్బాగ్ ఉద్యమం రూపాంతరం చెందక ముందే ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 22 ను రద్దు చేసి పాత ఉచిత విద్యుత్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్

చేశారు.లేనిపక్షంలో రైతులకు అమర్చే మీటర్లను బధ్ధలు కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ,రైతుసంఘం మండల నాయకులు టీ.రామచంద్ర,టీ. నరసింహులు,డి. నరసింహులు,రమేష్, ఆర్.క్రిష్ణప్ప,ఖాదర్ బాషా,యస్.శివమ్మ,ఎం.శివప్ప నాయుడు,చంద్ర,ఆంజనేయులు,రమనప్ప,శివన్న,భాస్కర, కె.వెంకటరమణ, రఘు,శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.


163 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon