• Neti Charithra

వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగిస్తే.. ధ్వంసం చేస్తాం- బి కొత్తకోట లో ప్రతి పక్షాల హెచ్చరిక..!


వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగిస్తే.. ధ్వంసం చేస్తాం- బి కొత్తకోట లో ప్రతి పక్షాల హెచ్చరిక..!బి కొత్తకోట: నేటి చరిత్ర


రైతుల వ్యవసాయ బోర్లకు మీటర్ లు బిగిస్తే

వాటిని ధ్వంసం చేస్తామని చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో అఖిల పక్షం నేతలు హెచ్చరించారు.శుక్రవారం స్థానిక బైపాస్ రోడ్ నందుగల జయరాం కొయ్యలమండీ ఆవరణంలో జరిగిన అఖిలపక్ష

సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,తెలుగుదేశం పార్టీ,కాంగ్రేస్ పార్టీ,భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, వి.సి.కె పార్టీ,భారతీయ అంబేద్కర్

సేన,ఎం.ఆర్.పీ. యస్ తదితర పార్టీలు మరియు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడారు.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ఎల్. నరసింహులు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

యస్.యమ్.పర్వీన్ తాజ్,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గపు ఇంచార్జ్ ఎం.ఎన్. చంద్రశేఖర్ రెడ్డి,వి.సి.కె పార్టీ నాయకులు ఎన్. సచిన్,సిపిఐ నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి,ఎం.ఆర్.పీ. యస్ నాయకులు దుమ్ము.చిన్నా తదితరులు మాట్లాడుతూ; రైతులకు ఉచిత విద్యుత్ విధానాన్ని రద్దు చేసే విధంగా జీవో నెంబర్ 22ను రాష్ట్ర ప్రభుత్వం

ప్రవేశపెట్టిందని, దీని ద్వారా నగదు బదిలీ పథకాన్ని అమలు జరపాలని నిర్ణయించిందన్నారు.అందువల్ల రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ విధానం నష్టపోవడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం విధించిన ఉచ్చులో రాష్ట్ర ప్రభుత్వం రైతులను బలి చేస్తున్నదనివాపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రెండు శాతం అప్పుల కొరకు కేంద్ర ప్రభుత్వం విధించిన షరతుల లో భాగంగా ఉచిత విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నదని ఆరోపించారు. రైతులను నట్టేట నుంచే నగదు బదిలీ పథకం వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు.అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ ఉచిత విద్యుత్ తీసుకొస్తే ఇప్పుడున్న వైసిపి ప్రభుత్వం YSJ రద్దు చేయడం దారుణం అన్నారు.కరోనా ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ -23%నికి పడిపోతే కేవలం వ్యవసాయ రంగం మాత్రమే 5 శాతం వృద్ధిరేటును సాధించింది. అటువంటి

వ్యవసాయరంగాన్ని ఈరోజు కుప్ప కూల్చడం తగదన్నారు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. అదే విధంగా మొత్తం ప్రజానీకానికి అన్నం పెట్టి,ఆకలి తీర్చే వ్యవసాయ రంగాన్ని కుదేలు పరచడం భవిష్యత్తులో ఆహార సంక్షోభాన్ని సృష్టిస్తుందని అన్నారు.నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు వ్యవసాయ రంగానికి నూటికి నూరు శాతం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ వుంటే మన దేశంలో మాత్రం వున్న సబ్సిడీలను తొలగించడం దారుణమన్నారు. నేటి కరోనా సంక్షోభం కాలంలో వ్యవసాయ రంగాన్ని మరియు దాని అనుబంధ రంగాలను వృద్ధి చేయడమొక్కటే దేశ భవిష్యత్తుకు మార్గం అన్నారు.రాయలసీమలోని మెట్ట ప్రాంత రైతులు బోర్లు మీద నే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నారని, అహర్నిశలు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నకిలీ విత్తనాలు, మరియు ఎరువుల సమస్యలను ఎదుర్కొని పంటలు పండించి సరుకులు మార్కెట్ కి తీసుకొని వస్తే దళారుల చేతిలో మోసపోతున్న రైతన్నలకు ఈ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైందన్నారు. అటువంటి వ్యవసాయ రంగాన్ని కుదేలు పరచడం తిరోగమన చర్యగా భారత దేశ ప్రజలు భావిస్తున్నారని,వ్యవసాయ రంగాన్ని మరిన్ని సబ్సిడీలతో ప్రోత్సహించాల్సిన బదులు ఈ విధమైన విద్యుత్ విధానాన్ని రద్దు చేయడం చాలా దారుణం అని ఆవేదన చెందారు. భవిష్యత్తులో ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని

కలుపుకుని పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.మరొక బషీర్బాగ్ ఉద్యమం రూపాంతరం చెందక ముందే ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 22 ను రద్దు చేసి పాత ఉచిత విద్యుత్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రైతులకు అమర్చే మీటర్లను బధ్ధలు కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎం.అష్రఫ్ అల్లీ, యస్.తంబయ్య శెట్టి,హెచ్.షమీవుల్లా,టీడీపీ నాయకులు డీ.నారాయణ,పలక.రవి,మనోహర్ నాయుడు,దుర్గారెడ్డి,కృష్ణారెడ్డి,వి.అంజి, బాస్ మండల అధ్యక్షుడు కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


371 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon