• Neti Charithra

విమానాశ్రయం కనబడలేదని.. విమానాన్ని పొలాల్లోదింపిన పైలెట్...  అనంతపురం లో హైరానా !

విమానాశ్రయం కనబడలేదని... విమానాన్ని పొలాల్లో దింపిన పైలెట్... అనంతపురం లో హైరానా!

అనంత‌పురం : నేటి చరిత్ర (ఫిబ్రవరి 17)

అనంతపురం సమీపంలో ఓ చిన్న విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ఇంజన్ లో లోపం తలెత్తడం, దగ్గర్లో విమానాశ్రయం లేకపోవడంతో, బ్రహ్మసముద్రం మండలం ఎరడికెరాలో విమానం పొలాల్లో దిగింది. ఈ విమానం కర్ణాటకకు చెందిన ఓ ఎంఎన్సీదిగా గుర్తించారు. విమానం ల్యాండ్ అయిన ప్రాంతం చదునుగా ఉండటంతో, ప్రయాణికులకు స్వల్ప గాయాలు మినహా మరే ప్రమాదమూ జరగలేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, విమానం వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విమానం ఎమర్జెన్సీ మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

201 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon