• Neti Charithra

విమానం లో తీసుకెళ్ల లేదని ఇంజనీరు భార్య ఆత్మహత్య!

#విమానం లో తీసుకెళ్ల లేదని ఇంజనీరు భార్య ఆత్మహత్య!

హైదరాబాదు: నేటి చరిత్ర (అక్టోబర్17) తన భర్త విమానంలో తిరుపతి తీసుకెళ్లలేదని ఓ ఇంజనీర్ భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణా లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన ఎన్‌.ప్రవళ్లిక (30) మాదాపూర్‌లోని ఆదిత్య బిర్లా సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీ నగర్‌లో నివసించే వెంకటరమణ (38)ను ఆమె 2014లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి తొమ్మిది నెలల వయసున్న రిత్విక అనే కుమార్తె ఉంది. ఈ నెల 10న పాప పుట్టువెంట్రుకలు తిరుపతిలో తీయాల్సి ఉండగా వెంకటరమణ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లాల్సి ఉంది. రైలులో వెళ్లడానికి టిక్కెట్లు చేసుకోగా అనివార్య కారణాల వల్ల ప్రయాణం వాయిదా పడింది. విమానంలో కుమార్తెను తీసుకువెళ్దామని భర్తను ప్రవళ్లిక కోరింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వారం రోజుల తరువాత అంతా కలిసి రైలులో వెళ్దామని ఆమెకు వెంకటరమణ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రెండు, మూడు రోజులుగా ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరుగుతోంది. తనకంటే తల్లిదండ్రులకే ఎక్కువ విలువనిస్తున్నాడని ఆమె మనస్తాపానికి గురైంది. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి తిరిగొచ్చిన అనంతరం భర్తతో మాట్లాడకుండా గదిలోకి వెళ్లి గడియపెట్టుకొంది. అలిగి పడుకుందని అతను భావించాడు. ఉదయం తలుపుకొట్టాడు. ఎంతకూ తీయకపోడంతో అనుమానంతో కిటికీలో నుంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గురువారం వేకువ జామున పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon