• Neti Charithra

విదేశాల్లో వైద్యం.. చేస్తూ.. గుంటూరు లో మద్యం అమ్ముతూ.. పోలీసులకు పట్టు పడ్డ ప్రముఖ వైద్యుడు!


విదేశాల్లో వైద్యం.. చేస్తూ.. గుంటూరు లో మద్యం అమ్ముతూ.. పోలీసులకు పట్టు పడ్డ ప్రముఖ వైద్యుడు!




గుంటూరు: నేటి చరిత్ర


నాడు.. రష్యా లో అతను ప్రముఖ వైద్యుడు .. నేడు గుంటూరు జిల్లా లో అక్రమ మద్యం అమ్ముతూ.. ఎక్సైజ్ పోలీసులకు

చిక్కున వైనం.. సంచలనం కలిగించింది.

ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌(డీసీ) డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు రాజేంద్రనగర్‌లోని అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో గుంటూరు ఈఎస్‌లు బాలకృష్ణన్‌,

చంద్రశేఖర్‌రెడ్డి, స్టేట్‌ టాస్క్‌ఫోర్సు సీఐ వీరేంద్ర, గుంటూరు-2 సీఐ రేఖ తమ సిబ్బందితో ఆ ప్రాంతంలో నిఘాపెట్టి వాహనాల తనిఖీలు చేపట్టారు. రాజేంద్రనగర్‌కు చెందిన లావు వంశీకృష్ణ కారు డిక్కీలో కర్ణాటకకు చెందిన 16 మద్యం సీసాలు గుర్తించారు. అతని ఇంటికి వెళ్లి

సోదా చేయగా, విదేశీ స్కాచ్‌ విస్కీతో పాటు మరో 37 దేశీయ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వంశీకృష్ణ గురించి విచారిస్తే, రష్యాలో ఆర్థోపెడిక్‌ వైద్యుడిగా పని చేశారని తెలియడంతో అధికారులు విస్మయం చెందారు. మద్యం సీసాలు కారులో పెట్టుకుని విక్రయించారని ప్రాథమిక విచారణలో తేలడంతో అతన్ని అరెస్టు చేసి మొత్తం 53 మద్యం సీసాలు, రూ.20 లక్షల విలువ చేసే కారు జప్తు చేశామన్నారు.

205 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon