• Neti Charithra

వైద్య శాస్త్రం లో ముగ్గురికి నోబుల్ బహుమతి!

#వైద్య శాస్త్రం లో ముగ్గురికి నోబుల్ బహుమతి!

ఢిల్లీ : నేటి చరిత్ర (అక్టోబర్7) ఈ ఏడాది వైద్య శాస్త్రం లో ముగ్గురుకి నోబెల్‌ బహుమతి లభించింది. అందులో ఇద్దరు అమెరికన్లు. ఒకరిది బ్రిటన్‌. విలయం జి. కెలిన్‌, ఎల్‌ సీమెన్జ్‌, సర్‌ పీటర్‌ జె ర్యాట్‌క్లిఫ్‌ ఈ పురస్కారం పొందిన వారిలో ఉన్నారు. ' కణాలు ఆక్సిజన్‌ను ఎలా గుర్తించి, స్వీకరిస్తాయి' అన్న అంశంపై చేసిన ఆవిష్కరణకు గానూ ఈ గౌరవం దక్కింది. ''ఆక్సిజన్‌ను గుర్తించడం అనేదే అధిక వ్యాధులకు కేంద్ర బిందువు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ద్వారా ఈ విషయాన్ని ఈ ఏడాది వెలుగులోకి తీసుకొచ్చారు. రక్త హీనత, క్యాన్సర్‌ వంటి అనేక వ్యాధుల పోరాటానికి శరీరశాస్త్రంలో కొత్త మార్గాన్ని కొనుగొన్నారు'' అని నోబెల్‌ ప్రైజ్‌ అసెంబ్లీ ట్వీట్‌ చేసింది. వైద్యశాస్త్రంలో అందుకోనున్న ఈ పురస్కారం 110వది. 1901 నుంచీ నోబెల్‌ను వైద్యశాస్త్రంలో సేవలందిస్తున్నవారికి ప్రదానం చేస్తున్నారు. 6కోట్ల రూపాయలను గ్రహీతలకు అందజేయనుంది. ఎంతమందికి ఈ గౌరవం దక్కితే అందరికి ఈ డబ్బును సమానంగా ఇవ్వనున్నారు. శరీర లేదా వైద్య శాస్త్రంలో నోబెల్‌ విజేతలను ప్రకటించిన అసెంబ్లీ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేసిన వారికి మంగళవారం, బుధవారం వరుసగా ఈ పురస్కారాలను ప్రకటించనుంది. డబుల్‌ హెడర్‌ సాహిత్య ప్రైజ్‌ను గురువారం, శాంతి నోబెల్‌ బహుబతిని శుక్రవారం ప్రకటించనున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon