• Neti Charithra

విద్యార్థుల నోరు.. కొడితే.. ఉద్యోగులు.. ఇంటికే - ఎమ్మెల్యే నవాజ్ బాషా హెచ్చరిక !

విద్యార్థుల నోరు కొట్టే.. ఉద్యోగులు ఇంటికే - ఎమ్మెల్యే నవాజ్ బాషా హెచ్చరిక !

మదనపల్లె: నేటి చరిత్ర (ఫిబ్రవరి4)

హాస్టల్ విద్యార్హులు నోరు కొడితే... ఉద్యోగులు ఇంటికి వెళ్లాల్సి వస్తుందని చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా హెచ్చరించారు. మంగళవారం ఆయాన స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ హాస్టల్ లో సుమారు 250 మంది విద్యార్థులు ఉండగా మెనూ లో భాగం గా నాన్ వెజ్ (చికెన్) వడ్డించాలి. అయితే వీరందరికీ కలిపి హాస్టల్ వార్డెన్ కేవలం 15 కిలోలు మాత్రమే చికెన్ తెప్పించగా అందులో 11 కిలోలు మాత్రం వడ్డించి నట్లు తెలు స్తోంది.

సుమాచారాన్ని కొందరు ఎమ్మెల్యే నవాజ్ బాషా దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి కప్పుడు స్పందించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా గురుకుల పాఠశాల హాస్టల్ ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులు ను అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన హాస్టల్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు అన్యాయం చేస్తే.. బాధ్యులు అయిన ఉద్యోగులు ఇంటి దారి పట్టడం ఖాయం అని హెచ్చరించారు.

42 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon