• Neti Charithra

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన .. నలుగురు " టీచర్ల" పై వేటు!

#విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన .. నలుగురు " టీచర్ల" పై వేటు!

కడప జిల్లాలో చదువు చెప్పే విద్యార్థిని ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు "టీచర్ల" పై ప్రభుత్వం వేటుకు.. ఉపక్రమించింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిట్వేలు మండల పరిధిలోని వెంకట్రాజుపల్లెలో ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఎంఈవో జయవేలు పేర్కొన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ పాఠశాలలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలపై ఈనెల 4వ తేదీన డిప్యూటీ డీఈవో వరలక్ష్మి విచారణ చేసి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదికను సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన డీఈవో శైలజ పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణను సస్పెండ్‌ చేశారని, హిందీ ఉపాధ్యాయుడు పి. రవీంద్రనాథ్‌, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు హుస్సేన్‌, రమేష్‌ బాబుకు సంజాయిషీ తాఖీదులను జారీ చేసినట్లు మండల కార్యాలయానికి సమాచారం అందిందని ఎంఈవో పేర్కొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon