• Neti Charithra

విద్యార్థి కేశవరెడ్డి మరణం దురదృష్ట కరం..- బిటి కళాశాల ప్రిన్స్ పాల్ మల్లికార్జున రావు

#విద్యార్థి కేశవరెడ్డి మరణం దురదృష్ట కరం..- బిటి కళాశాల ప్రిన్స్ పాల్ మల్లికార్జున రావు

మదనపల్లె: నేటి చరిత్ర (సెప్టెంబర్20) చిత్తూరు జిల్లా మదనపల్లె బీ.టీ.కాలేజి విద్యార్ధి కేశవరెడ్డి మరణం దురదృష్టకరమని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టరు మల్లికార్జునరావు అన్నారు. స్థానిక దేశాయ్ తిప్పారెడ్డి ఫంక్షన్ హాల్ నందు ప్రజానేస్తాం యువ నాయకుడు ఈ నెల 9 తేదీన మరణించిన కేశవరెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథి గా విచ్చేసిన ప్రిన్సిపాల్ మల్లికార్జున రావు మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగి వున్నా విద్యార్తి అని అతని ద్వారా 20 మంది విద్యార్థులను చేర్పించడం జరిగిందని అన్నారు. ఏ కార్యక్రమం జరిగిన ముందుండి నడిపిస్తాడని అలాంటి విద్యార్తి దూరం కావడం బాధాకరమన్నారు . విశ్రాంత ప్రిన్సిపాల్ వై.ఎస్.మునిరత్నం మాట్లాడుతూ ప్రజానేస్తాం ద్వారా క్రికెట్ టోర్నమెంట్ , రక్తదాన కార్యక్రమాలు అనేక సదస్సు లు క్రియాశీలకంగా వ్యవహరించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానేస్తాం అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి , కామకోటి ప్రసాదరావు, సిపిఐ కృష్ణప్ప, గురుప్రసాద్, సేగు రెడ్డెప్పరెడ్డీ, కేశవరెడ్డి తల్లి తండ్రులు మల్లీశ్వరమ్మ , సుధాకర రెడ్డి బంధువులు, మిత్రులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon