• Neti Charithra

విద్యా భ్యాసం.. చేయించే.. గురువు లు.. కీచకులయ్యారు.. విద్యార్థిని పై పది మంది టీచర్లు.. అత్యాచారం..!


విద్యా భ్యాసం.. చేయించే.. గురువు లు.. కీచకులయ్యారు.. విద్యార్థిని పై పది మంది టీచర్లు.. అత్యాచారం..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)



సభ్య సమాజం తలదించుకునే.. ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. విద్యాభ్యాసం చేయాల్సిన ఉపాధ్యాయులు ఓ విద్యార్థిని పై సామూహిక అత్యాచారానికి పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.రాజస్థాన్‌లో 13 ఏళ్ళవిద్యార్థినిపై పాఠశాల ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆల్వార్‌ జిల్లాలోని నారాయణ్‌పుర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. పాఠశాల మేనేజర్‌తోపాటు ఉపాధ్యాయులు, ఇతరులు ఈ

అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. ఈ మేరకు 13 మంది సిబ్బందిపై పోక్సో, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బాలికపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులకు సహకరించారన్న ఆరోపణపై ముగ్గురు మహిళా టీచర్లపైనా కేసు నమోదైంది.