• Neti Charithra

విద్యుత్ చార్జీల పెంపు.. పేదలకు మోయలేని భారం- టీడీపీ నేత ఖాదర్ బాష!



విద్యుత్ చార్జీల పెంపు.. పేదలకు మోయలేని భారం- టీడీపీ నేత ఖాదర్ బాష!



రాయచోటి: నేటి చరిత్ర


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు జిల్లా అధికార ప్రతినిధి గాజుల ఖాదర్ భాషా విమర్శించారు. కడపజిల్లా రాయచోటి లో

మంగళవారం నాడు ఆయన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెలలో ఏప్రిల్ నెలలో విద్యుత్ బిల్లులు వేటికి అవే విడివిడిగా నమోదు చేయకపోవడం వల్ల రెండు నెలలకు కలిసి మీటర్ల లోని రీడింగ్ పై స్లాబ్ కు చేరడంతో బిల్లులు వేల రూపాయల్లో వస్తున్నాయన్నారు ఈ కారణంగా కేవలం 200 నుండి 300 రూపాయలు లోపు మాత్రమే బిల్లుగా చెల్లించే వినియోగదారులు ప్రస్తుతం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చెల్లించాలంటూ విద్యుత్ కార్య లయం నుండి నోటీసులు వస్తున్నాయన్నారు లాక్ డోన్ కారణంగా బిల్లులను నమోదు చేసే సిబ్బంది అప్పట్లో వినియోగదారుల ఇళ్ల వద్దకు రారని గత ఏడాది అదే నెలలో కట్టవలసిన మొత్తాన్ని మాత్రమే కట్టించుకుంటా ము అని ప్రభుత్వం చెప్పిందన్నారు ఇది నిజమే అని అని నమ్మిన మధ్యతరగతి దిగువ తరగతి వినియోగదారులు ప్రస్తుతం వస్తున్న బిల్లులను చూసి తాము నిలువునా మోసపోయిన ట్లు ఆవేదన చెందుతున్నారని ఆయన చెప్పారు విడివిడిగా రీడింగ్ నమోదు చేస్తే తప్ప ఆర్థిక భారం తాము మోయ లేమని ప్రతి ప్రాంతంలోనూ వినియోగదారులు వా పోతున్నట్లు వివరించారు ప్రజలకు మెరుగైన పాలన అందించడం అంటే కపట వాగ్దానాలు చేసి వారిని నమ్మకంతో వంచించడం కాదన్నారు ఇప్పటికైనా వైకాపా సర్కారు బిల్లుల వ్యవహారంలో జోక్యం చేసుకొని భారీగా వస్తున్న బిల్లులను సవరించి వినియోగదారులను ఆదుకోవాలన్నారు ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అంజద్ అలీఖాన్ మరియు చిన్న మండల మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి పాల్గొన్నారు



94 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon