• Neti Charithra

వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యం లో అవగాహన ర్యాలీ....

#వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యం లో అవగాహన ర్యాలీ..

గుర్రంకొండ: నేటి చరిత్ర (సెప్టెంబర్13) చిత్తూరు జిల్లా గుర్రంకొండ లో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యం లో శుక్రవారం డెంగీ వ్యాధి పై విద్యార్థులు కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుర్రంకొండ మండల కేంద్రంలో ని జిల్లా పరిషత్ పాఠశాల లో ఆరోగ్యవిద్యాధికారి మహమ్మద్ రఫీ దోమల ద్వారా వ్యాప్తి చెందు వ్యాధులు పై అవగాహన కల్పించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి భద్రత అన్నారు. ఇంటి పరిసరాలను ప్రతి తల్లీ పరిశుభ్రముగా ఉంచుకోవడం వల్ల దోమల పెరుగుదల ను అరికట్టవచ్చన్నారు. ఈకార్యక్రమంలో సి.హెచ్.ఓ.విజయీశ్వర రావు,హెచ్.ఎం.శివయ్య,ఆరోగ్య పర్యవేక్షకులు ఆది లక్ష్మీ,నాగరాజ,ఏ. ఎన్. ఎంలు,ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon