• Neti Charithra

విజృంభిస్తున్న..కరోనా.. 28 మంది ఎమ్మెల్యేల కు కరోనా పాజిటివ్..!


విజృంభిస్తున్న..కరోనా.. 28 మంది ఎమ్మెల్యేల కు కరోనా పాజిటివ్..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)



తమిళనాడులో కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే నిత్యం వేలల్లో పాజిటివ్‌ కేసులు నిర్దారణ అవుతున్నాయి. ఇప్పటికే గవర్నర్‌తో సహా పలువురు అధికార పార్టీకి చెందిన మంత్రులు,

ఎమ్మెల్యేలతో సహా విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు సైతం మహమ్మారి బారినపడ్డారు. తాజాగా డీఎంకే పార్టీకి చెందిన తంజావూరు ఎమ్మెల్యే టీకేజీ నీలమేగం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో చికిత్స కోసం ఆయన తంజూవూరు హాస్పిటల్‌లో చేరారు. ఇప్పటి వరకు 27 మంది తమిళనాడు ఎమ్మెల్యేలకు వైరస్‌ సోకింది. ఇందులో ఏఐఏడీఎంకేకు చెందిన 11 మంది, డీఎంకే నుంచి 13, ఏఐసీసీ నుంచి ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర

ఎమ్మెల్యేలు మహమ్మారి బారినపడ్డారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాష్ట్రంలో 5,880 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ కాగా, 119 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2,85,024కు చేరింది. 5,880 కేసుల్లో చెన్నైలో 984 ఉన్నాయి. ఇప్పటి వరకు మహానగరంలో 1,07,109 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. ప్రస్తుతం తమిళనాడులో 52,759 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


702 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon